సోమవారం 25 జనవరి 2021
National - Jan 04, 2021 , 22:10:09

బర్డ్‌ ఫ్లూ కలకలం.. 1775 వలస పక్షులు మృతి

బర్డ్‌ ఫ్లూ కలకలం.. 1775 వలస పక్షులు మృతి

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని పాంగ్ ఆనకట్ట పరిధిలో అనుమానాస్పదంగా మరణించిన విదేశీ వలస పక్షుల సంఖ్య 1775కు చేరింది. అంతరించిపోతున్న బార్ హెడ్ గూస్, బ్లాక్ హెడ్ గల్, రివర్ టెర్న్, కామన్ టీల్, షోవెలర్ వంటి పక్షులు చనిపోయిన వాటిలో ఉన్నాయి. కాగా ఈ పక్షుల మరణానికి బర్డ్‌ ఫ్లూనే కారణమని నిర్ధారించారు. పాంగ్ డ్యామ్ ప్రాంతంలోని వన్య ప్రాణుల సంరక్షణ ప్రాంతంలో చనిపోయిన ఐదు బార్ హెడ్ గూస్ పక్షుల నమూనాల్లో హెచ్ 5 ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. బర్డ్‌ ఫ్లూగా పేర్కొనే ఈ వైరస్‌ మనుషులకు సోకే ప్రమాదం ఉందని చెప్పారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ఆ ప్రాంతంలో నిషేధిత ఆంక్షలు విధించింది. పాంగ్ డ్యామ్ లేదా హెచ్చరిక జోన్‌లోని కిలోమీటర్ పరిధిలో మనుషుల కదలికలను అనుమతించరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏదైనా జాతి పక్షులు, చేపలు వాటికి సంబంధించిన ఉత్పత్తులు (గుడ్లు, మాంసం, కోడి) మొదలైన వాటి అమ్మకం, కొనుగోలు, ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌తోపాటు కేరళ, మరో రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo