ఆదివారం 29 మార్చి 2020
National - Feb 11, 2020 , 09:47:36

నిజమైన దేశభక్తికి మా గెలుపే రుజువు

నిజమైన దేశభక్తికి మా గెలుపే రుజువు

న్యూఢిల్లీ : వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఆప్‌ 50 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. నిజమైన దేశభక్తికి మా గెలుపే రుజువు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో పని చేసేందుకు అవకాశం వస్తే.. ప్రజల కోసం పని చేయాలి. విద్యా వ్యవస్థ, ఆస్పత్రుల మీద దృష్టి పెట్టాలన్నారు. ఇవే తమ గెలుపుకు కారణమయ్యాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. నిబద్ధతతో పని చేసిన పార్టీకే ఢిల్లీ ప్రజలు మద్దతు తెలిపారని సిసోడియా చెప్పారు. తాము విద్య, ఆస్పత్రులపై మాట్లాడితే.. కొందరైతే హిందూ - ముస్లింల గురించి మాట్లాడారని సిసోడియా ఎద్దెవా చేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్‌ 50కి పైగా స్థానాల్లో, బీజేపీ 18 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ కనీసం ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేదు.


logo