మంగళవారం 26 జనవరి 2021
National - Dec 31, 2020 , 16:55:56

మా ఓట‌ర్లు సెల‌వుల్లో ఉన్నారు.. అందుకే ఓడాం

మా ఓట‌ర్లు సెల‌వుల్లో ఉన్నారు.. అందుకే ఓడాం

చంఢీఘ‌డ్‌: హ‌ర్యానాలో ఇటీవ‌ల జ‌రిగిన అయిదు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మూడింటిలో బీజేపీ ఓట‌మి పాలైంది.  దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ ప్ర‌తినిధి సంజ‌య్ శ‌ర్మ ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.  త‌మ పార్టీ ఓట‌ర్లు సెల‌వుల మూడ్‌లో ఉండ‌డం వ‌ల్ల‌.. త‌మ పార్టీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందిన‌ట్లు ఆయ‌న అన్నారు.  బీజేపీ, జ‌న‌తా జ‌న‌నాయ‌క్ పార్టీ సంయుక్తంగా హ‌ర్యానాలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. తాజా ఎన్నిక‌ల్లో సోనిప‌ట్‌, అంబాలా న‌గ‌రాల్లోనూ మేయ‌ర్ రేసును బీజేపీ కోల్పోయింది. హిస్సార్‌లోని ఉక‌లానా, రేవారిలోని ధ‌రుహెరాల్లోనూ జేజేపీ ఓడింది.  డిసెంబ‌ర్ 25, 26, 27 తేదీల్లో సెల‌వులు అని, డిసెంబ‌ర్ చివ‌ర్లో ఇయ‌ర్ ఎండ్ కావ‌డం వ‌ల్ల ఆ రోజుల్లో ప్ర‌జ‌లు హాలీడే మూడ్‌లో ఉన్నార‌ని, వాళ్లంతా లాంగ్ ట్రిప్పుల‌కు వెళ్లార‌ని, అయితే సెల‌వుల‌పై వెళ్లిన పౌరులంతా త‌మ పార్టీ ఓట‌ర్లే అని బీజేపీ ప్ర‌తినిధి సంజ‌య్ శ‌ర్మ అన్నారు.  logo