శనివారం 28 మార్చి 2020
National - Feb 24, 2020 , 14:58:21

పాకిస్థాన్‌తో మంచి సంబంధాలున్నాయి : డోనాల్డ్ ట్రంప్‌

పాకిస్థాన్‌తో మంచి సంబంధాలున్నాయి :  డోనాల్డ్ ట్రంప్‌

హైద‌రాబాద్‌: ఉగ్ర‌వాదాన్ని నిలువ‌రించేందుకు అమెరికా, భార‌త్ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయ‌నున్న‌ట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  అహ్మ‌దాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఇవాళ జ‌రిగిన న‌మ‌స్తే ట్రంప్ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.  ఉగ్ర‌వాద భావ‌జాలానికి వ్య‌తిరేకంగా త‌మ దేశం పోరాటం చేస్తున్న‌ట్లు చెప్పారు.  తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. పాకిస్థాన్‌ను క‌ట్ట‌డి చేశామ‌న్నారు.  ఉగ్ర కార్య‌క‌లాపాల‌ను పాక్ త‌గ్గించే విధంగా చూశామ‌న్నారు. బోర్డ‌ర్‌లో ఆప‌రేట్ చేస్తున్న మిలిటెంట్ల‌ను అదుపు చేయాల‌ని  పాక్‌ను హెచ్చ‌రించిన‌ట్లు చెప్పారు.  ప్ర‌స్తుతం పాకిస్థాన్‌తో మంచి సంబంధ‌మే ఉంద‌న్నారు.  పాకిస్థాన్‌తో సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తున్న‌ట్లు తెలిపారు. పాక్‌, భార‌త్ మ‌ధ్య ఉత్కంఠ ప‌రిస్థితి త‌గ్గుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. స్థిర‌త్వం సాధిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దీంతో ద‌క్షిణాసియాలో శాంతి విక‌సిస్తుంద‌న్న భావాన్ని ట్రంప్ వినిపించారు.  ఇండియా చేప‌ట్టిన చంద్ర‌యాన్ ప్రోగ్రామ్‌ను ట్రంప్ కీర్తించారు. అంత‌రిక్ష స‌హ‌కారాన్ని అందించేందుకు తాము ఆస‌క్తిగా ఉన్నామ‌ని ట్రంప్ అన్నారు.  గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ యూఎస్ఏ, వీ ల‌వ్ యూ, ఇండియా అంటూ త‌న ప్ర‌సంగాన్ని ట్రంప్ ముగించారు.  


logo