శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 15:20:49

టెక్నాల‌జీ ఫ‌స్ట్‌.. అదే మా విధానం: ప‌్ర‌ధాని మోదీ

టెక్నాల‌జీ ఫ‌స్ట్‌.. అదే మా విధానం: ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: అయిదేళ్ల క్రితం మొద‌లుపెట్టిన డిజిట‌ల్ ఇండియా మిష‌న్ ఇప్పుడు పేద‌, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లతో పాటు ప్ర‌భుత్వాల్లోనూ ఓ జీవన‌శైలిగా మారింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. బెంగుళూరులో జ‌రిగిన టెక్ స‌మ్మిట్‌ను ఉద్దేశిస్తూ వ‌ర్చువ‌ల్ ప్ర‌సంగం చేసిన మోదీ.. టెక్నాల‌జీ ఫ‌స్ట్ అన్న నినాదాన్ని త‌మ ప్ర‌భుత్వం ప‌రిపాల‌నా విధానంగా భావించిన‌ట్లు తెలిపారు. స‌మాచార యుగంలో భార‌త్ ముంద‌డుగు వేసేందుకు సిద్ధంగా ఉంద‌ని, మ‌న వ‌ద్ద బెస్ట్ మైండ్స్ ఉన్నాయ‌ని, మార్కెట్ కూడా పెద్ద‌ద‌ని, స్థానికంగా ఉన్న టెక్ సొల్యూష‌న్‌కు గ్లోబ‌ల్ ప‌రిష్కారాలు ఇవ్వ‌గ‌ల‌వ‌ని, ఇండియాలో డిజైన్ అయిన టెక్ సొల్యూష‌న్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినియోగిస్తున్నార‌ని ప్ర‌ధాని అన్నారు.  

టెక్నాల‌జీ యుగంలో కోవిడ్ మ‌హ‌మ్మారి ఓ మ‌లుపు మాత్ర‌మే కానీ, అది అంతం కాదు అని,  ప్ర‌స్తుతం ఉన్న టెక్నాల‌జీ ఆధారంగానే వీలైనంత త్వ‌ర‌గా అధిక జ‌నాభాకు త‌క్కువ స‌మ‌యంలోనే టీకా ఇవ్వ‌గ‌ల విశ్వాసం ఏర్ప‌డింద‌న్నారు.  ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద ఆరోగ్య ప‌థ‌కం ఆయుష్మాన్ భార‌త్ స‌క్సెస్‌లో టెక్నాల‌జీ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.

స్వ‌మిత్వా స్కీమ్ గురించి చెప్పిన ప్ర‌ధాని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ల‌క్ష‌ల సంఖ్య ప్ర‌‌జ‌ల‌కు ఆ స్కీమ్ ద్వారా భూమి ప‌ట్టాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. డ్రోన్ల టెక్నాల‌జీ ద్వారా ఈ ప్ర‌య‌త్నం మ‌రింత సులువైంద‌న్నారు.  ఇది ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం మాత్ర‌మే కాదు, ఇది ప్ర‌జ‌ల్ని మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని మోదీ అన్నారు.  ఒక‌సారి ప్ర‌జ‌ల‌కు ప్రాప‌ర్టీ హ‌క్కులు వ‌స్తే, అప్పుడు టెక్నాల‌జీ ఆ స‌మ‌స్య‌ల్ని తీర్చుతుంద‌న్నారు.  ర‌క్ష‌ణ రంగంలోనూ యూఏవీ టెక్నాల‌జీ కొత్త చ‌రిత్రను సృష్టిస్తోంద‌న్నారు.