ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 18:17:01

క‌రోనా క‌ట్ట‌డికి స‌మ‌ర్థంగా ప‌నిచేస్తున్నాం‌: ‌బెంగాల్ సీఎం

క‌రోనా క‌ట్ట‌డికి స‌మ‌ర్థంగా ప‌నిచేస్తున్నాం‌: ‌బెంగాల్ సీఎం

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డంలో ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం స‌మ‌ర్థంగా ప‌నిచేస్తున్న‌ద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి చెప్పారు. క‌రోనా ర‌క్క‌సిని నిలువ‌రించ‌డం కోసం ఆరోగ్య రంగానికి సంబంధించిన అన్ని ర‌కాల మౌలిక‌స‌దుపాయాలతో పూర్తిస్థాయిలో స‌న్న‌ద్ధ‌మై ప‌నిచేస్తున్నామ‌ని ఆమె పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించ‌డం, ముఖాల‌కు మాస్కులు ధ‌రించ‌డం, ఇత‌ర జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మ‌హ‌మ్మారిని త‌రుమ‌డానికి స‌రైన మార్గాల‌ని మ‌మ‌త అభిప్రాయ‌ప‌డ్డారు. 

మ‌రోవైపు రాష్ట్రంలో ప్ర‌జ‌ల అవ‌స‌రాల నిమిత్తం మూడు కోట్ల మాస్కులు సేక‌రించాల‌ని ప‌శ్చిమ‌బెంగాల్ స‌ర్కారు నిర్ణ‌యించింది. ఆ‌‌ మాస్కుల‌ను రాష్ట్రంలోని వివిధ‌ పాఠ‌శాల‌ల విద్యార్థులు, 100 రోజుల ప‌ని ల‌బ్ధిదారులు, క‌రోనాపై ముందు వ‌రుస‌లో నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, స్వ‌చ్ఛంగా క‌రోనా నిర్మూల‌న కోసం ప‌నిచేస్తున్న పౌర సేవ‌కులకు ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది.           


logo