బుధవారం 20 జనవరి 2021
National - Jan 08, 2021 , 19:37:12

లా వాప‌సీ త‌ర్వాతే మేం ఘ‌ర్‌వాప‌సీ: రైతుల ఆల్టిమేటం

లా వాప‌సీ త‌ర్వాతే మేం ఘ‌ర్‌వాప‌సీ: రైతుల ఆల్టిమేటం

న్యూఢిల్లీ: కేంద్రం త‌న వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తేనే తాము తిరిగి ఇంటికి వెళ్తామ‌ని రైతు సంఘం నేత ఒక‌రు చెప్పారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు కోసం ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న చేస్తున్న రైతుల‌తో కేంద్రం శుక్ర‌వారం ఎనిమిదో విడుత జ‌రిపిన చ‌ర్చ‌లు కూఆ విఫ‌లం అయ్యాయి. ఈ చ‌ట్టాలు పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల కోసం కాద‌ని, యావ‌త్ దేశం కోస‌మ‌ని కేంద్ర మంత్రులు చెప్పిన‌ట్లు తెలుస్తున్న‌ది. అయితే త‌మ డిమాండ్‌కు క‌ట్టుబ‌డి ఉన్న అన్న‌దాత‌లు.. కేంద్ర చ‌ట్టానికి విరుగుడుగా రాష్ట్రాలు సొంత చ‌ట్టాలు చేసుకునే వెసులుబాటు క‌ల్పించాల‌న్న ప్ర‌తిపాద‌న తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది. త‌దుప‌రి చ‌ర్చ‌లు ఈ నెల 15వ తేదీన జ‌రుగ‌నున్నాయి. 

కేంద్ర వ్య‌వ‌సాయ చట్టాల‌పై చ‌ర్చ జ‌రిగినా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ చెప్పారు. చ‌ట్టాల ర‌ద్దుకు బ‌దులు రైతులు ఏదైనా ప్ర‌తిపాద‌న తీసుకొస్తే అంగీక‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. కానీ రైతులు ఎటువంటి ప్ర‌తిపాద‌న త‌మ ముందుకు తీసుకు రాలేద‌న్నారు. ఎటువంటి నిర్ణ‌యం లేకుండానే స‌మావేశం ముగిసింద‌ని, త‌దుప‌రి స‌మావేశం ఈ నెల 15వ తేదీన జ‌రుగుతుంద‌న్నారు. 

ఆందోళ‌న చేస్తున్న రైతులు త‌మ డిమాండ్‌ను క‌ఠిన‌త‌రం చేశారు. కేంద్రం త‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశాకే తాము ఇంటికి వెళ‌తామ‌ని ఓ రైతు సంఘ నేత చెప్పారు. మ‌రో రైతు సంఘ నేత మాట్లాడుతూ వ్య‌వ‌సాయం రాష్ట్రాల స‌బ్జెక్ట్ అని, ఇందులో జోక్యం చేసుకోరాద‌ని సుప్రీంకోర్టు ప‌లు తీర్పుల్లో స్ప‌ష్టం చేసింద‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల పేరిట కాల‌యాప‌న చేస్తున్న‌ద‌ని రైతు సంఘాల నేత‌లు చెప్పారు. స‌మావేశంలో కొంద‌రు రైతులు మాకు చావోరేవో అని పేర్కొంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.

చ‌ట్టాలను ర‌ద్దు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేద‌ని అఖిల‌భార‌త కిసాన్ సంఘ‌ర్ష్ స‌మ‌న్వ‌య క‌మిటీ (ఏఐకేఎస్సీసీ) స‌భ్యురాలు క‌వితా కురుగంటి చెప్పారు. చ‌ర్చ‌ల్లో 40 మందికి పైగా రైతు సంఘాల నేత‌లు పాల్గొన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున వ్య‌వ‌సాయ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌, రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్‌, వాణిజ్య‌శాఖ స‌హాయ మంత్రి సోం ప్ర‌కాశ్ హాజ‌ర‌య్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo