బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 12:50:27

సీఎం ఓఎస్డీ ఫోన్ ట్యాపింగ్ చేశారు.. అది అక్రమం

సీఎం ఓఎస్డీ ఫోన్ ట్యాపింగ్ చేశారు.. అది అక్రమం

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఓఎస్డీ లోకేశ్ శర్మ, ఇతరులు ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రతిపక్ష బీజేపీ నేత జీసీ కటారియా ఆరోపించారు. అయితే వారికి ఆ అధికారం లేదని, ఇది అక్రమమని విమర్శించారు. ఫోన్ ట్యాప్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉన్నదని, అయితే హోంశాఖ అనుమతితోనే చేయాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేయడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని కటారియా తెలిపారు. బీజేపీ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య సంభాషణ జరిగినట్లుగా ఓ ఆడియో టేప్ ఇటీవల వెలుగుచూసిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరోవైపు బీజేపీ ఎప్పుడూ బలపరీక్షను కోరలేదని కటారియా తెలిపారు. కాంగ్రెస్‌లో అంతర్గత పోరును గమనిస్తున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన విధంగా స్పందిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కూడా తాము బలపరీక్షను కోరడం లేదని, ఈ అంశంలో తమను అనవసరంగా లాగుతున్నారని కటారియా విమర్శించారు.
logo