గురువారం 09 జూలై 2020
National - Apr 28, 2020 , 11:58:01

బెంగాల్‌లో కరోనాతో మరో డాక్టర్‌ మృతి

బెంగాల్‌లో  కరోనాతో మరో డాక్టర్‌ మృతి

కోల్‌కతా: కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు అదే వైరస్‌ బారినపడి మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలా కరోనా వైరస్‌ బారినపడుతున్న డాక్టర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా కోల్‌కతాలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మరణించారు. ఈ నెల 14న అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రముఖ హాస్పిట్‌లో చేరిన 69 ఏండ్ల ఆర్థోపెడిక్‌ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆరోగ్యం క్షీణించడంతో ఏప్రిల్‌ 17 నుంచి ఆయనకు వెంటీలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఆయన సోమవారం రాత్రి మృతిచెందారు. ఇప్పటికే ఆరోగ్య శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డా. బిప్లబ్‌ కాంతి దాస్‌గుప్తా అదే దవాఖానలో ఆదివారం మరణించారు. దీంతో బెంగాల్‌లో ఈ ప్రాణాంతక వైరస్‌తో మరణించిన డాక్టర్ల సంఖ్య రెండుకు చేరింది. 


logo