శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 17:31:30

క‌రోనా క‌ల‌క‌లం.. ఒడిశా హైకోర్టు మూసివేత‌

క‌రోనా క‌ల‌క‌లం.. ఒడిశా హైకోర్టు మూసివేత‌

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశా హైకోర్టులో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపింది. హైకోర్టులోని వివిధ విభాగాల్లో ప‌ని చేసే ప‌లువురికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం కోర్టును మూసివేయ‌నున్న‌ట్లు రిజిస్ర్టార్ జ‌న‌ర‌ల్ తెలిపారు. కోర్టును రేపు మొత్తం శానిటైజ్ చేస్తామ‌న్నారు. ఇవాళ కోర్టు ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల‌ను మూసివేయించారు. 

ఒడిశాలో ఇప్ప‌టి వ‌ర‌కు 44,193 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి నుంచి 28,698 మంది కోలుకోగా, 15,188 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. క‌రోనా వైర‌స్ ధాటికి 307 మంది చ‌నిపోయారు.