సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 15:30:26

క‌రోనా ఎక్క‌డ పుట్టిందో తెలియ‌దు: చైనా

క‌రోనా ఎక్క‌డ పుట్టిందో తెలియ‌దు:  చైనా

హైద‌రాబాద్‌:  చైనాలోని హుబేయ్ ప్రావిన్సులో ఉన్న వుహాన్ న‌గ‌రం నుంచి నోవెల్ క‌రోనా వైర‌స్ విశ్వ‌వ్యాప్త‌మైన విష‌యం తెలిసిందే. కానీ ఆ ప్రాణాంత‌క వైర‌స్ జ‌న్మ‌స్థానం ఎక్క‌డో చెప్ప‌డం కష్టంగానే ఉన్న‌ది.  ఆ వైర‌స్ జ‌న్యు మూలాల‌ను గుర్తించ‌క ముందే.. దాని గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌డం అవివేక‌మే అవుతుంద‌ని తాజాగా చైనా పేర్కొన్న‌ది.   ఆ దేశానికి చెందిన శ్వాస‌కోస వ్యాధుల నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.  నోవెల్ క‌రోనా వైర‌స్ వుహాన్‌లో పుట్టిన విష‌యం వాస్త‌వ‌మే అయినా.. అది అక్క‌డ‌కు ఎలా వ‌చ్చింద‌న్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేద‌ని జాంగ్ అన్నారు. వుహాన్‌లో క‌రోనా తొలి ల‌క్ష‌ణాలు గుర్తించినా.. అది ఆ న‌గ‌రంలోనే పుట్టిన‌ట్లు కాద‌న్నారు. వుహాన్‌లోనే క‌రోనా ఆవిర్భవించిన‌ట్లు ఆధారాలు లేవ‌న్నారు.  ఇది ఓ సైద్ధాంతిక ప్ర‌శ్న అని ఆయ‌న అన్నారు. 

వైర‌స్ క్ర‌మ‌క్ర‌మేనా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో.. వైర‌స్ పుట్టుక‌కు సంబంధించిన ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని జాంగ్ చెప్పారు. వైర‌స్ జ‌న్యుక్ర‌మం తెలియ‌కుండానే, అది ఏ చోటు నుంచి వ‌చ్చిందో చెప్ప‌డం బాధ్య‌తారాహిత్య‌మే అవుతుంద‌ని ఆయ‌న అన్నారు. వైర‌స్ ఎక్క‌డ పుట్టింద‌న్న దానిపై త‌మ‌కు స‌మ‌గ్ర‌మైన స‌మాచారం లేద‌న్నారు. వైర‌స్ సోర్స్ ఏంటో తెలియ‌ద‌న్నారు.  చైనా నుంచే ఆ వైర‌స్ విశ్వ‌వ్యాప్త‌మైంద‌న్న విష‌యాన్ని తాను గ‌తంలో చెప్పాన‌ని,  కానీ వైర‌స్ పుట్ట‌డానికి గ‌ల కార‌ణాలు త‌న‌కు తెలియ‌ద‌న్నారు.  వైర‌స్ ఏ కుటుంబానికి చెందిన‌ద‌ని, దాని జీవ‌వైవిధ్యం, వైర‌స్ పురోగ‌తికి సంబంధించి భ‌విష్య‌త్తులో తెలుస్తాయ‌న్నారు.  ఇది చైనీస్ వైర‌స్సే అని అమెరికా ప‌దేప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో చైనా ఈ వివ‌ర‌ణ‌ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.


logo