శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 13:40:25

నిర్భ‌య దోషుల అవ‌య‌వ దానం వ‌ద్దు..

నిర్భ‌య దోషుల అవ‌య‌వ దానం వ‌ద్దు..


హైద‌రాబాద్‌:  నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా ఉన్న న‌లుగురి అవ‌య‌వాల‌ను దానం చేయాలంటూ వేసిన ఓ పిటిష‌న్‌ను ఇవాళ సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది.  ఓ వ్య‌క్తిని చంప‌డం వ‌ల్ల‌.. ఆ కుటుంబానికి తీర‌ని శోకాన్ని మిగులుస్తుంద‌ని, అవ‌య‌వ దానం కోసం దోషుల‌ను ముక్క‌లుగా చేయ‌డం స‌రికాదు అని, వారి ప‌ట్ల మాన‌వ క‌నిక‌రం క‌లిగి ఉండాల‌ని, అవ‌యవ దానం అనేది స్వ‌చ్ఛందంగా జ‌ర‌గాల‌ని సుప్రీంకోర్టు త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డింది.  ఉరిశిక్ష ఎదుర్కోనున్న న‌లుగురు దోషుల‌కు అవ‌య‌వాలు దానం చేసే వీలు క‌ల్పించాల‌ని మాజీ న్యాయ‌మూర్తి ఎంఎఫ్ స‌ల్దానా త‌న పిటిష‌న్‌లో కోరారు. నిందితుడు ప‌వ‌న్ గుప్తా పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిష‌న్‌ను కూడా సుప్రీం కొట్టిపారేసింది.  ఇప్ప‌టికే ఈ కేసులో నిందితులు ముఖేశ్ కుమార్ సింగ్‌, విన‌య్ కుమార్ శ‌ర్మ‌ల క్ష‌మాభిక్ష పిటిష‌న్ల‌ను తిర‌స్క‌రించింది. అయితే క్ష‌మాభిక్ష పిటిష‌న్‌ను మ‌రో నిందితుడు అక్ష‌య్‌కుమార్ ఇంకా ఛాలెంజ్ చేయ‌లేదు. 2012, డిసెంబ‌ర్ 16న ఢిల్లీలో జ‌రిగిన గ్యాంగ్ రేప్‌లో ఆరుగుర్ని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన నిందితుడు రామ్ సింగ్‌.. జైలు సెల్‌లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.  మ‌రో టీనేజ్ యువ‌కుడు మూడేళ్ల శిక్ష త‌ర్వాత విడుద‌ల‌య్యాడు.  ఈ కేసులో న‌లుగురు దోషులుకు మార్చి 3వ తేదీన ఉరిశిక్ష వేయాల‌ని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. 


logo