శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 21:11:14

టీచ‌ర్ల‌ను మ‌ద్యం షాపుల వ‌ద్ద ఉంచే నిర్ణ‌యం ర‌ద్దు...

టీచ‌ర్ల‌ను మ‌ద్యం షాపుల వ‌ద్ద ఉంచే నిర్ణ‌యం ర‌ద్దు...

నాగ్‌పూర్‌: మ‌హారాష్ట్రాలోని అకోలా జిల్లాలో క‌ళాశాల ఉపాధ్యాయుల‌ను మ‌ద్యం షాపుల వ‌ద్ద ఉంచే నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేశారు. సోమ‌వారం నుంచి రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాలు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే స్థానిక అధికారులు శ్రీ గాడ్జే మ‌హారాజ్ కాలేజీకి చెందిన 9 మంది ఉపాధ్యాయుల‌కు ముర్టిజాపూర్ ప‌ట్ట‌ణంలోని మ‌ద్యం దుకాణాల వ‌ద్ద విధులు కేటాయించింది.

 మ‌ద్యం కొన‌డానికి వ‌చ్చే వారిని బౌతిక దూరం ఉంచ‌డం ఈ ఉపాధ్యాయుల ప‌ని. ఉపాధ్యాయుల‌ను ఈ ప‌నికి నియ‌మించ‌డాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకించి ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ప్ర‌భుత్వం లోక‌ల్ అధికారులు ఇచ్చిన ఉత్త‌ర్వులు ర‌ద్దు చేసింది. రెవెన్యూ, వ్య‌వ‌సాయం, ఇత‌ర విభాగాల సిబ్బంది ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ సంబంధిత విధుల్లో ఉండ‌టం వ‌ల్ల‌, సిబ్బంది కొర‌త కార‌ణంగా ఉపాధ్యాయుల‌కు ఈ విధులు కేటాయించామ‌ని త‌హ‌సీల్దార్ ప్ర‌దీప్ ప‌వార్ వివ‌ర‌ణ ఇచ్చారు. 


logo