గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:02:36

48 గంట‌ల పాటు భారీ వ‌ర్షం.. కేర‌ళ‌లో ఆరెంజ్ అల‌ర్ట్‌

48 గంట‌ల పాటు భారీ వ‌ర్షం.. కేర‌ళ‌లో ఆరెంజ్ అల‌ర్ట్‌

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లో ఇవాళ ఉద‌యం నుంచి  ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది. మ‌రో 48 గంట‌ల పాటు వ‌ర్షం ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ శాఖ‌ ఇవాళ ఆరెంజ్ హెచ్చ‌రిక జారీ చేసింది. తిరువ‌నంత‌పురం, తిస్సూరు, ఎర్నాకుళం, అల‌ప్పుజా, కొట్టాయం జిల్లాల్లో తెల్ల‌వారుజాము నుంచి వ‌ర్షం కురుస్తున్న‌ట్లు ఐఎండీ చెప్పింది. ఎర్నాకుళం జిల్లాలోని అనేక లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. నీరు నిలిచిపోవ‌డం వ‌ల్ల కొచ్చి న‌గ‌రంలో ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. కొట్టాయం రైల్వే స్టేష‌న్ స‌మీపంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో రైల్వే ట్రాక్ క్లియ‌ర్ చేసే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. వ‌ర్షం ఇలాగే కొన‌సాగితే మ‌ణిమ‌ల‌యార్ డ్యామ్ గేట్లు ఎత్తివేస్తామ‌ని పాత‌న‌మిట్ట క‌లెక్ట‌ర్ తెలిపారు. ఇప్ప‌టికే తిరువ‌నంత‌పురంలోని అరువిక‌ర డ్యామ్ గేట్ల‌ను ఎత్తివేశారు.

 

 


logo