శనివారం 30 మే 2020
National - May 22, 2020 , 19:57:15

అంఫాన్‌ తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: 22 విపక్ష పార్టీలు

అంఫాన్‌ తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: 22 విపక్ష పార్టీలు

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలపై విరుచుకుపడ్డ అంఫాన్‌ తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని దేశంలోని 22 విపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. తుఫాన్‌ ప్రభావిత రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సూచించాయి. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపు మేరకు శుక్రవారం శుక్రవారం 22 విపక్ష పార్టీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా బెంగాల్‌, ఒడిశాలను కేంద్రం ఆదుకోవాలంటూ ఒక తీర్మానం చేసి ఆమోదించారు. 

అంతకుముందు కరోనా నియంత్రణ విషయంలో నరేంద్రమోదీ సర్కారు తీరుపై సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. సమాఖ్య స్పూర్తిని కేంద్రం విస్మరించిందని, ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలన్న బాధ్యతను మరిచిందని ఆమె మండిపడ్డారు. సంస్కరణల పేరిట ప్రభుత్వం వైల్డ్‌ అడ్వెంచర్‌కు తెరతీసిందని సోనియా ఆరోపించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాస్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌, జేడీఎస్‌ నేత హెచ్‌డీ దేవెగౌడ తదితరులు పాల్గొన్నారు.


logo