బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 14:47:08

వివాహేతర సంబంధం.. సోదరిని చంపిన అన్నదమ్ములు

వివాహేతర సంబంధం.. సోదరిని చంపిన అన్నదమ్ములు

లక్నో : వివాహేతర సంబంధం ఓ వితంతువు ప్రాణాలను బలిగొంది. తోడబుట్టిన అన్నదమ్ములే ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని న్యూమండి పోలీసు స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. కోకడ గ్రామానికి చెందిన సుమిత్‌ కుమార్‌, సోను అన్నదమ్ములు. వీరికి ఓ సోదరి ఉంది. అయితే ఈమె భర్త రెండేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. ఆ తర్వాత వితంతువు మరో యువకుడు జుల్‌ఫికర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. జుల్‌ఫికర్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఈ ప్రతిపాదనను ఆమె సోదరులు తీవ్రంగా ఖండించారు. అంతటితో ఆగకుండా.. వితంతువును గొంతునులిమి చంపారు. అంత్యక్రియలు కూడా చేశారు. విషయం తెలుసుకున్న జుల్‌ఫికర్‌.. తన ప్రేయసి సోదరులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo