బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 20:58:49

రంగంలోకి దిగిన ముగ్గురు నేవి మహిళా పైలట్లు

రంగంలోకి దిగిన ముగ్గురు నేవి మహిళా పైలట్లు

న్యూఢిల్లీ : భారత నేవీ మహిళా పైలట్ల మొదటి బ్యాచ్ కార్యాచరణలోకి వచ్చింది. మొదటి బ్యాచ్‌లోని ముగ్గురు మహిళా పైలట్లు డోర్నియర్ విమానంలో ప్రయాణించనున్నారు. వీరికి దక్షిణ నావల్ కమాండ్ కింద కొచ్చిలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ ముగ్గురు పైలట్లు.. లెఫ్టినెంట్ దివ్య శర్మ (ఢిల్లీ), లెఫ్టినెంట్ శుభంగి స్వరూప్ (ఉత్తరప్రదేశ్), లెఫ్టినెంట్ శివంగి (బిహార్) ఉన్నారు. నౌకాదళం గురువారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 22 న ఆరుగురు పైలట్లు కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ నుంచి 27 వ డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్సు (డాఫ్ట్) ను ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు మహిళా పైలట్లు ఒకే బ్యాచ్‌లో భాగం. ఆపరేషన్ డ్యూటీ (ఎంఆర్) కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పైలట్లకు డోర్నియర్‌ ఆపరేషనల్‌ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ కోర్సుకు పంపే ముందు వైమానిక దళం, నావికాదళంలో ప్రాథమికంగా ఫ్లయింగ్‌ శిక్షణ ఇవ్వబడింది. ఈ కోర్సులో ఒక నెల గ్రౌండ్ ట్రైనింగ్, ఎనిమిది నెలల ఫ్లయింగ్ ట్రైనింగ్ ఉన్నాయి. పైలట్లందరినీ ఫ్లయింగ్‌ శిక్షణ కోసం డోర్నియర్ స్క్వాడ్రన్‌కు పంపారు. కార్యాచరణ విధులకు అర్హత సాధించిన ముగ్గురు మహిళా పైలట్లలో లెఫ్టినెంట్ శివాంగి మొదటిసారిగా గత డిసెంబర్ 2 వ తేదీన నావల్ పైలట్‌గా అర్హత సాధించారు. 15 రోజుల తరువాత లెఫ్టినెంట్ దివ్య శర్మ, లెఫ్టినెంట్ శుభంగి స్వరూప్ కూడా పైలట్లు అయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.