బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 11:33:49

విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ స‌ముద్ర‌సేతు

విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ స‌ముద్ర‌సేతు

కొచ్చి: లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు ఉద్దేశించిన ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టికే భార‌త యుద్ధ‌నౌక ఐఎన్ఎస్ జ‌లాశ్వ మాల్దీవులు నుంచి 698 మంది భార‌తీయులను తీసుకుని మే 10న భార‌త్‌కు చేరింది. ఇప్పుడు రెండో మ‌ల‌క‌లో మ‌రో 700 మంది భారతీయుల‌ను తీసుకొచ్చేందుకు బ‌య‌లుదేరింది. ఇదిలావుంటే ఐఎన్ఎస్ మ‌గ‌ర్ 202 మంది భార‌తీయుల‌ను తీసుకుని భార‌త్‌కు వ‌స్తున్న‌ది. ఈ నౌక మంగ‌ళ‌వారం సాయంత్రానికి కేర‌ళ‌లోని కొచ్చి తీరానికి చేరుకోనుంది.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo