సోమవారం 30 మార్చి 2020
National - Mar 26, 2020 , 23:44:14

తెరుచుకున్న పండ్లు, కూరగాయల మార్కెట్లు

తెరుచుకున్న పండ్లు, కూరగాయల మార్కెట్లు

-1600 మార్కెట్లలో సేవలు ప్రారంభం 

న్యూఢిల్లీ, మార్చి 26: దేశవ్యాప్తంగా సుమారు 1600 పండ్ల, కూరగాయల మార్కెట్లు మళ్లీ తెరుచుకున్నాయని కేంద్ర వ్యవసాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. మరో 300 మార్కెట్లు శుక్రవారం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాయన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో వ్యవసాయ మార్కెట్ల ఇన్‌చార్జీలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ, టోకు మార్కెట్‌ బోర్డులతో నిత్యం కేంద్ర వ్యవసాయశాఖ సంప్రదింపులు జరుపుతున్నది. 


logo