శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 11:50:03

షాప్‌లు తెరుచుకోండి.. మీకు భద్రతగా మేమున్నాం

షాప్‌లు తెరుచుకోండి.. మీకు భద్రతగా మేమున్నాం

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ ఓ పి శర్మ ఇవాళ చాంద్‌బాగ్‌లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా దుకాణ సమూదాయాలు తెరుచుకోండని అన్నారు. మీకు రక్షణగా మేమున్నామని తెలిపారు. ముఖ్యంగా మెడికల్‌ షాపులు, కిరాణం.. తదుపరి షాపులన్నీ తెరిచి ప్రజలకు సహకరించాలని ఆయన కోరారు. రోడ్లపై ఎవరూ గ్రూపులుగా ఉండకూడదనీ.. ముఖ్యంగా యువకులు బృందాలుగా ఏర్పడకూడదని ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఢిల్లీలో చెలరేగిన హింసలో ఇప్పటికే 34 మంది మరణించగా.. వందలాది మంది గాయాలపాలయ్యారు. 


logo