గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 15:31:59

ఛండీగఢ్‌లో విద్యార్థుల కోసం ఓపెన్‌ జిమ్ములు

ఛండీగఢ్‌లో విద్యార్థుల కోసం ఓపెన్‌ జిమ్ములు

ఛండీగఢ్‌: విద్యార్థులు ఆరోగ్యంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే దేశం ఫిట్‌గా ఉంటుందని ఛండీగఢ్‌ ప్రభుత్వం.. సీనియర్‌ సెకండరీ విద్యార్థుల కోసం  ఓపెన్‌ జిమ్ములు ప్రారంభించాలని నిర్ణయించింది. ఆదివారం ఉదయం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు సీఎస్‌ ఆర్కే తివారీ ఆదేశాలు జారీచేశారు. ఓపెన్‌ జిమ్‌లతోపాటు అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో శానిటరీ వెండింగ్‌ మెషిన్లు, సరైన రీతిలో కాల్చివేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. నీతి ఆయోగ్‌ గుర్తించిన ఎనిమిది ఆశాజనక జిల్లాల్లో కొత్తగా నిర్మించిన అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియెట్‌ విద్యాసంస్థల్లో విద్యుత్‌ ఉత్పత్తికి సోలార్‌ ప్యానెళ్లను బిగించాలని, విద్యార్థులు సౌకర్యవంతంగా  కూర్చునేందుకు తగిన ఫర్నీచర్‌ను సమకూర్చాలని సూచించారు. విద్యార్థలు ఇంగ్లిష్‌లో పరిజ్ఞానం  సంపాదించేందుకుగాను కంప్యూటర్‌ ల్యాబులు, లాంగ్వేజ్‌ ల్యాబులు కూడా ఏర్పాటుచేయాలన్నారు. రెండు గదులు మాత్రమే ఉన్న పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు నివేదికలు సిద్ధం చేయాలని సీఎస్‌ తివారీ చెప్పారు.


logo