గురువారం 02 జూలై 2020
National - Jun 27, 2020 , 17:56:49

సర్‌ గంగారాం హాస్పిటల్‌లో ‘ఓపీడీ’ సేవలు ప్రారంభం

సర్‌ గంగారాం హాస్పిటల్‌లో ‘ఓపీడీ’ సేవలు ప్రారంభం

న్యూఢిల్లీ : దేశరాజధానిలోని ప్రఖ్యాత సర్ గంగారాం హాస్పిటల్‌లో 3నెలల తరువాత శనివారం ఓపీడీ (ఔట్‌ పేషంట్‌ డిపార్టుమెంట్‌) సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 8గంటల వరకు ఓపీడీ సేవలు అందిస్తామని ఆ హాస్పిటల్‌ చైర్మన్‌, బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డాక్టర్‌ డీఎస్‌ రాణా తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏయిమ్స్‌) జూన్‌ 25వరకు దవాఖానల్లో ఓపీడీ సేవలు నిలిపేయాలని నిర్ణయించడంతో ఈ హాస్పిటల్‌లో 3నెలల పాటు సేవలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 77,420 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంరక్షణ మంత్రిత్వశాఖ నివేదించింది.


logo