శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 12, 2021 , 17:04:04

కేవ‌లం రెండు రాష్ట్రాల్లోనే 50 వేల‌కుపైగా యాక్టివ్ కేసులు: ‌కేంద్రం

కేవ‌లం రెండు రాష్ట్రాల్లోనే 50 వేల‌కుపైగా యాక్టివ్ కేసులు: ‌కేంద్రం

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం క్ర‌మం త‌గ్గుతున్న‌దని, ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2.20 ల‌క్ష‌ల దిగువ‌కు చేరిందని కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం దేశంలో మ‌హారాష్ట్ర‌, కేర‌ళ రాష్ట్రాల్లో మాత్ర‌మే 50 వేల‌కుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని, మిగ‌తా రాష్ట్రాల్లో ఎక్క‌డా యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల‌కు ద‌రిదాపుల్లో కూడా లేద‌ని రాజేష్ భూష‌ణ్ తెలిపారు. 

క‌రోనా నిర్మూల‌న కోసం కేంద్రం 1.10 కోట్ల డోసుల‌ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌, 55 ల‌క్ష‌ల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు చేయ‌డానికి ఒప్పందాలు కుదుర్చుకుంద‌ని రాజేష్ భూష‌ణ్ వెల్ల‌డించారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ ఒక్కో డోసుకు రూ.200 చొప్పున చెల్లించ‌నుంద‌ని తెలిపారు. భార‌త్ బ‌యోటెక్ కంపెనీ 16.5 ల‌క్ష‌ల డోసుల కొవాగ్జిన్‌ను ఉచితంగా, 38.5 ల‌క్ష‌ల డోసుల‌ను ఒక్కో డోసుకు రూ.295 లెక్క‌న అందించ‌నుంద‌ని వెల్ల‌డించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo