సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 02:40:09

ప్రజలే సర్పంచ్‌ను తీసేయొచ్చు

ప్రజలే సర్పంచ్‌ను తీసేయొచ్చు

చండీగఢ్‌: గ్రామ సర్పంచ్‌ (పెద్ద)ను ఆ గ్రామ ప్రజలే తొలగించేందుకు అధికారమిస్తూ హర్యానా అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. ఈ మేరకు హర్యానా పంచాయతీ రాజ్‌ (రెండో సవరణ) బిల్లు-2020ను రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, శనివారం ఆమోదించింది. సదరు సర్పంచ్‌ పనితీరు సరిగా లేకుంటే, ఆయన పదవీకాలం ముగియక ముందే ఆ గ్రామస్తులు తొలగించేలా చట్టంలో నిబంధనను చేర్చారు. ఈ నిబంధన పంచాయతీరాజ్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా చెప్పారు.