గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 17:06:01

ఇది కేవలం భారత్‌లోనే సాధ్యం.. ఏమంటారు?

ఇది కేవలం భారత్‌లోనే సాధ్యం.. ఏమంటారు?

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఒక పట్టణం. కేదార్‌నాథ్ ఆలయం కారణంగా ఈ పట్టణానికి ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇది రుద్రప్రయాగ్ జిల్లాలోని నగర పంచాయతీ. నాలుగు చోటా చార్ ధామ్ సైట్లలో అత్యంత మారుమూలమైన కేదార్‌నాథ్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3,583 మీ ఎత్తులో ఉన్నది. మంచుతో కప్పబడిన శిఖరాలతో చూసేందుకు ఎంతో రమణీయంగా ఉంటుంది.

అయితే, ఇతర ప్రాంతాల నుంచి  కేదార్‌నాథ్‌ రావాలంటే చాలా కష్టపడాల్సిందే. ఎత్తైన పర్వతాల మధ్య సరైన రోడ్డు సౌకర్యం ఉండదు. పలు ప్రాంతాల్లో మెట్లతో కట్టిన రహదారులు కనిపిస్తాయి. వీటిపైనే వాహనాలు నడుస్తాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆరుగురు వ్యక్తుల బృందం ట్రాక్టర్‌పై కూర్చుని పెద్ద వస్తువు ఒకదాన్ని గ్రామంలోకి తీసుకువస్తున్నారు. మరికొందరు తాడుల సహాయంతో ట్రాక్టర్‌లోని వస్తువు కిందపడకుండా చూస్తున్నారు.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పంచుకున్నారు. "ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది" అని కాప్షన్‌ కూడా పెట్టాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియోను 72,000 కన్నా ఎక్కువ మంది వీక్షించారు.logo