బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 18:16:16

కరోనా నుంచి మ‌మ్మ‌ల్ని దేవుడే ర‌క్షించాలి: మ‌ంత్రి శ్రీ‌రాములు

కరోనా నుంచి మ‌మ్మ‌ల్ని దేవుడే ర‌క్షించాలి: మ‌ంత్రి శ్రీ‌రాములు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో క‌రోనా వైర‌స్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీనిపై ఆ రాష్ర్ట ఆరోగ్య‌శాఖ మంత్రి బి. శ్రీ‌రాములు మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌-19 ప‌ట్ల ప్ర‌జ‌లు అవ‌గాహ‌నతో మెల‌గాల‌న్నారు. లేక‌పోతే దేవుడు మాత్ర‌మే వారిని కోవిడ్‌-19 నుంచి ర‌క్షించగ‌ల‌డ‌న్నారు. ఈ సమయంలో మమ్మల్ని ఎవరు రక్షించగలరు? అది దేవుడు మాత్ర‌మే లేదా ప్రజలు అవగాహన పెంచుకోవ‌డం ద్వారా మాత్ర‌మేన‌న్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులు బుర‌ద‌ రాజకీయల్లో మునిగిపోయార‌న్నారు. ఇది ఎంత‌మాత్రం మంచిది కాద‌న్నారు. అది వారికి ఏటువంటి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌ద‌న్నారు. 

క‌రోనా విజృంబిస్తున్న ప్ర‌స్తుత స‌మ‌యం చాలా కీలకమ‌న్నారు. ప్రజల ప్రయోజనార్థం ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారం మాట్లాడ‌వ‌ద్ద‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు తెలిపారు. బాధ్య‌తార‌హిత మాట‌లు సాధార‌ణ‌ ప్రజల్లో మరింత భయాందోళనలకు దారితీస్తుంద‌న్నారు. మేమేదైనా త‌ప్పుగా చేస్తే ఎటువంటి శిక్షకైనా కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో ఇప్పటివరకు 47,253 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.


logo