శనివారం 30 మే 2020
National - May 11, 2020 , 18:27:56

అహ్మ‌దాబాద్‌లో క్యాష్‌లెస్ హోమ్ డెలివ‌రీల‌కు మాత్ర‌మే ప‌ర్మిష‌న్

అహ్మ‌దాబాద్‌లో క్యాష్‌లెస్ హోమ్ డెలివ‌రీల‌కు మాత్ర‌మే ప‌ర్మిష‌న్

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విస్త‌రించ‌కుండా అక్క‌డి అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. న‌గ‌రంలో ఆహారం, నిత్యావ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువులు ఆర్డ‌ర్ చేసే వారు ఇక నుంచి త‌ప్ప‌నిస‌రిగా డిజిట‌ల్ చెల్లింపులు చేయాల‌ని, న‌గ‌దు చెల్లింపుల‌కు అనుమ‌తి లేద‌ని అధికారులు స్ప‌ష్టంచేశారు. వివిధ సంస్థ‌ల‌కు చెందిన హోమ్ డెలివ‌రీ సిబ్బంది కూడా ఎట్టి ప‌రిస్థితుల్లో న‌గ‌దు చెల్లింపుల‌ను అంగీక‌రించవ‌ద్ద‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వ అద‌న‌పు కార్య‌ద‌ర్శి రాజీవ్ కుమార్ గుప్తా ఆదేశించారు. క్యాష్‌లెస్ హోమ్ డెలివ‌రీల ద్వారా క‌రెన్సీ నోట్ల‌తో క‌రోనా విస్త‌రించ‌కుండా అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అధికారులు తెలిపారు. అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా ఉన్నందున క‌రెన్సీ నోట్ల ద్వారా వైర‌స్ విస్త‌రించే ప్ర‌మాదం ఉంద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.   

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo