గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 17:33:33

54% భారతీయులకు ఆ సౌకర్యాల్లేవ్‌!

54%  భారతీయులకు ఆ సౌకర్యాల్లేవ్‌!

కరోనా ప్రపంచాన్ని కష్టాల్లో ముంచేస్తోంది. విద్యాసంస్థలు.. ఉద్యోగ సంస్థలు ఒక్కొక్కటి షట్‌డౌన్‌ అవుతున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగుల కోసం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఫెసిలిటీస్‌ కల్పిస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఐటీ సంస్థలే కాకుండా మీడియా సంస్థలు కూడా ఇంటి దగ్గర నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. మిగిలిన అన్ని రంగాల్లోని సంస్థలూ ఈ అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్న సమయంలో ఒక వార్త వారిని తీవ్రంగా ఆలోచింపచేస్తోంది. అదేంటంటే.. 

కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ కంపెనీలన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ ప్రణాళికలు సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాయి. ప్రముఖ ఐటీ సేవా నిర్వహణ సంస్థ గార్డెనర్‌ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో 54% కంపెనీలకు తమ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే సరైన సౌకర్యాలు.. మార్గాలు.. వనరులు లేవు. వీడియో.. కాన్ఫరెన్సింగ్‌.. ఇతర సాఫ్ట్‌వేర్‌ వంటి సాధనాలకు మాత్రమే ఈ రకమైన అవకాశం ఉంది. ఐటీయేతర సంస్థలు ఈ రకమైన అధికారాన్ని ఆస్వాదించవు పైగా ఎలాంటి అనుభవమూ వాటికి లేదు. కరోనా ప్రభావం వల్ల ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటిదేదైనా ప్లాన్‌ చేద్దామా అంటే సరైన సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఐటీయేతర కంపెనీల్లో పనిచేసేవారు మేజర్‌గా డెస్క్‌టాప్స్‌పైనే ఆధారపడి పనిచేస్తున్నారు. వీరికి ల్యాప్‌టాప్‌ వినియోగించే సౌకర్యాలు పెద్దగా లేవు. ఇవన్నీ ఇంటర్నెట్‌ బేస్డ్‌ కంపెనీలే కాబట్టి ఆఫీసులో నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలు పొందుతారు. అదే ఇంట్లో అయితే అంత ఇంటర్నెట్‌ స్పీడ్‌ అందించే సౌకర్యాలు ఇంకా మెరుగవ్వలేదు. కేవలం 46% కంపెనీలకు మాత్రం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పనిచేయించుకునే సౌకర్యాలు ఉన్నట్లు గార్డెనర్‌ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 


logo
>>>>>>