గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 02:08:09

పరిశోధనల్లో మహిళలు 15 శాతమే!

పరిశోధనల్లో మహిళలు 15 శాతమే!
  • వారి భాగస్వామ్యం పెరుగాలి
  • రాష్ట్రపతి కోవింద్‌ పిలుపు

న్యూఢిల్లీ: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (శాస్త్ర, సాంకేతిక) రంగంలో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృదిలో మహిళాసాధికారత చాలా కీలకమని, కానీ దేశాభివృద్ధిలో కీలక పరిశోధన, అభివృద్ధి విభాగంలో మహిళలు 15 శాతమే ఉండటం ఆందోళన కరమన్నారు. పరిశోధన, అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరుగాలని శుక్రవారం జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘గతేడాది శ్రీహరికోట నుంచి చం ద్రయాన్‌-2ను ప్రయోగించిన ప్పుడు నేనక్కడికి వెళ్లాను. అక్కడ ఓ మ హిళా శాస్త్రవేత్తను చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ ప్రాజెక్టు కోసం ఆమె తన 6 నెలల బాలుడిని కుటుంబం వద్ద వదిలేసి కష్టపడ్డారు. ఆమె స్ఫూర్తిగా మరింత మంది మహిళలు ఈ రంగంలోకి రావాలి’ అని పిలుపునిచ్చారు. ‘జెండర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇన్టిట్యూషన్స్‌' (జీఏటీఐ) అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌, ‘విజ్ఞాన్‌ జ్యోతి’ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు.


శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ సెల్యూట్‌

జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.


logo