మంగళవారం 19 జనవరి 2021
National - Dec 29, 2020 , 19:48:16

కొత్త ఏడాదిలో దిగిరానున్న ఉల్లి ధరలు...! ఇదే కారణం...?

కొత్త ఏడాదిలో దిగిరానున్న ఉల్లి ధరలు...! ఇదే కారణం...?

ఢిల్లీ :కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతిదారులకు శుభవార్త అందించింది. కొద్దినెలల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి భారీగా నష్టపోయాయి. సరఫరా విషయంలోను ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఉల్లి ధరలు కిలో రూ.200 పైగా పలికింది. దీంతో కేంద్రం వెంటనే చర్యలు చేపట్టి, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. దీంతో ఉల్లి ధరలు క్రమంగా కిందకు దిగి వచ్చాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.25 నుంచి రూ.35 మధ్య ఉన్నది. ఈసారి పంట రావడం, దిగుమతులు ఉండటంతో ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

ఉల్లి ఎగుమతిపై విధించిన నిషేధాన్నిఎత్తివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. 2021 జనవరి 1వ తేదీ నుంచి అన్ని రకాల ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది. ఉల్లి ధరలను అదుపు చేసేందుకు విదేశాలకు ఉల్లి విత్తనాల ఎగుమతిని తక్షణమే నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ (డిజిఎఫ్టీ) సెప్టెంబర్ 15వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. హోల్‌సేలర్ల వద్ద 25 టన్నులు, రిటైలర్ల వద్ద 2 టన్నులకు మించి ఉల్లి నిల్వలు ఉండరాదని ఇది వరకే కేంద్రం ఆంక్షలు విధించింది.

' 2021 జనవరి 1తేదీ నుంచి అన్ని రకాల ఉల్లి ఎగుమతి చేసుకోవచ్చు' అని నోటిఫికేషన్‌లో తెలిపింది కేంద్ర సర్కారు. ఏప్రిల్-జూలై కాలంలో ఉల్లి ఎగుమతులు 30 శాతం పెరిగాయి. ఆ తర్వాత వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయింది. దీంతో ధరలు పెరిగాయి. అధికారిక డేటా ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 328 మిలియన్ డాలర్ల ఫ్రెష్ ఉల్లి, 112 మిలియన్ డాలర్ల డ్రైడ్ ఉల్లి ఎగుమతులు జరిగాయి. ఏప్రిల్-జూలై 2020లో బంగ్లాదేశ్‌కే ఎగుమతులు 157.7 శాతం పెరిగాయి.


ఇవి కూడా చదవండి... 

ఏ రాశి వారు... ఏ చెట్టు నరకకూడదో తెలుసా...? 

  భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ప్రపంచ రుచుల వేదిక ‘45th ఎవెన్యూ’ ప్రారంభం

ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి