బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 15:17:26

అస్సాంలో కొనసాగుతున్న వరద బీభత్సం

అస్సాంలో కొనసాగుతున్న వరద బీభత్సం

డిస్పూర్: అస్సాం రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతుంది. దాదాపు 30 జిల్లాల్లో 56 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. వరద బీభత్సానికి 5305 గ్రామాల్లో వందలాది ఇండ్లు నీటమునిగాయి. ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం 615 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. దాదాపు 1.5 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. 25 వేల మంది ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

ఇప్పటి వరకు వరదల కారణంగా 103 మంది మృతి చెందారు. మృతులకు అస్సాం ప్రభుత్వం నాలుగు లక్షల పరిహారం ప్రకటించింది. వరదల కారణంగా 2,59,899 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి.  కజిరంగా నేషనల్ పార్క్‌లో భారీగా వరద నీరు రావడంతో వందలాది వన్యప్రాణాలు మృత్యువాత పడ్డాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo