శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 01:48:50

సీరం అగ్ని ప్రమాదంలో వెయ్యి కోట్ల నష్టం

సీరం అగ్ని ప్రమాదంలో వెయ్యి కోట్ల నష్టం

పుణె: అగ్ని ప్రమాదంలో తమకు రూ. 1000 కోట్లపైనే నష్టం వాటిల్లిందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) వెల్లడించింది. రోటావైరస్‌, బీసీజీ టీకాలను ఉత్పత్తి చేసే చోట ప్రమాదం సంభవించిందని సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా చెప్పారు. ప్రమాద స్థలాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని, ఇది నిజంగా ప్రమాదమా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

VIDEOS

logo