గురువారం 02 జూలై 2020
National - Jun 05, 2020 , 07:54:41

రాజౌరిలో ఎదురుకాల్పులు..ఉగ్రవాది హతం

రాజౌరిలో ఎదురుకాల్పులు..ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌ రాజౌరిలోని కాలకోటేలో ఉగ్రవాదులున్న  ప్రాంతాన్ని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబటంతో..అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. మరోవైపు ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

రాజౌరి సెక్టార్‌లోని ఉగ్రవాద కదలికలున్న ప్రాంతాలను నిన్న రాత్రి నుంచే భద్రతాదళాలు చుట్టుముట్టాయి. సరిహద్దుల గుండా ఉగ్రవాదులు చొరబడే అవకాశమున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతాబలగాలు కొన్ని రోజులుగా ఎక్కడికక్కడ తనిఖీలు కొనసాగిస్తూ..ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టాయి. logo