గురువారం 04 జూన్ 2020
National - May 17, 2020 , 14:38:12

కశ్మీర్‌లో ఉగ్రవాది హతం

కశ్మీర్‌లో ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో దోడా జిల్లా గుండ్నాలో భద్రతా బలగాలు శనివారం అర్ధరాత్రి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారని జమ్ముకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. భద్రదళాల ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు. 


logo