గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 09:53:08

బుద్గాంలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

బుద్గాంలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

జుమ్ముకశ్మీర్‌ : జమ్ము కశ్మీర్‌లోని  బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు.  క్రార్-ఇ-షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం తెలిసి సోమవారం రాత్రి నుంచి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఇవాళ ఉదయం ముష్కరులు నుంచి అనూహ్యంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు సైతం కాల్పులు జరపడంతో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందాడని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇక్కడ ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్నది తెలియరాలేదని ఆపరేషన్‌ కొనసాగుతున్నది పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo