శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 14:22:06

ఒక ఆత్మ‌హ‌త్య‌పై 3 నెల‌లు రాద్దాంత‌మా..?: శ‌ర‌ద్‌ప‌వార్

ఒక ఆత్మ‌హ‌త్య‌పై 3 నెల‌లు రాద్దాంత‌మా..?: శ‌ర‌ద్‌ప‌వార్

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌పై గ‌త మూడు నెల‌లుగా వివాదాలు చెల‌రేగుతుండ‌టం, మ‌హారాష్ట్ర‌లోని అధికార శివ‌సేన పార్టీ సైతం ఈ విష‌యంలో గ‌త కొంత కాలంగా న‌టి కంగ‌నా ర‌నౌత్‌తో క‌య్యానికి దిగడంపై నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ అధ్యక్షుడు శ‌ర‌ద్ ప‌వార్ అసంతృప్తి వ్య‌క్తంచేశారు. మ‌హారాష్ట్ర సంకీర్ణ స‌ర్కారులో భాగ‌స్వామి కూడా అయిన ప‌వార్‌.. ఒక ఆత్మ‌హ‌త్య‌పై మూడు నెల‌లు రాద్దాంతం అవ‌స‌ర‌మా..? అని ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో రైతులు కూడా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని, ప్ర‌భుత్వం అన‌వ‌స‌ర వివాదాల జోలికి వెళ్ల‌కుండా రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పైన కూడా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. మూడు నెల‌లుగా కేవ‌లం ఒక ఆత్మ‌హ‌త్య‌పై మాట్లాడుతూ ఇత‌ర విష‌యాల‌న్నింటిని విస్మ‌రించ‌డం క‌రెక్టు కాద‌ని ప‌వార్ హిత‌వు ప‌లికారు.   ‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.