ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 25, 2020 , 16:51:49

వన్ ప్లస్ 7టీ ఎక్స్చేంజ్ ఆఫర్...

 వన్ ప్లస్ 7టీ ఎక్స్చేంజ్ ఆఫర్...

బెంగళూరు :వన్ ప్లస్ 7టీను లాంచ్ చేసి సంవత్సరంపూర్తయింది. వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8టీ వచ్చాక కూడా వన్ ప్లస్ 7టీ నే చాలా బాగుందనే మాటలు వినిపించాయి. వన్ ప్లస్ 7టీ చాలా ఫాస్ట్ గా పని చేస్తుందని, అద్భుతమైన స్క్రీన్ తో పాటూ మంచి కెమెరాలు, డిజైన్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ మొబైల్ ను రూ.32,999 లకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ వెబ్సైట్ ఈ ఆఫర్ ను అందిస్తున్నది. ఇక పాత ఫోన్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకుంటే మరింత తక్కువ ధరకే లభించనుంది. వన్ ప్లస్ 7టీ 256 జీబీ వేరియంట్ ధరను రూ.37,999లకు అమెజాన్ లో ఉంచారు.

యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కార్డులను ఉపయోగించడం ద్వారా ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. తక్కువ ధరకే మంచి మొబైల్ కావాలని అనుకుంటూ ఉన్న వాళ్లు ఈ మొబైల్ ఫోన్ ను కొనుక్కోవచ్చని టెక్ నిపుణులు చెబుతూ ఉన్నారు. బెస్ట్ మొబైల్స్ లో ఇది కూడా ఒకటని.. రూ.32,999లకు లభిస్తూ ఉందంటే మంచి డీల్ అనే చెబుతున్నారు. వన్ ప్లస్ 7టీ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఉంది, వన్ ప్లస్ 8టీ, 8జీబీ ర్యామ్ మొబైల్ ఫోన్ స్క్రీన్ తరహాలో ఈ మొబైల్ ఫోన్ ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.