సోమవారం 30 మార్చి 2020
National - Mar 19, 2020 , 10:44:55

దంతెవాడలో మావోయిస్టు హతం

దంతెవాడలో మావోయిస్టు హతం

ఛత్తీస్‌గఢ్‌ : దంతెవాడ జిల్లా కిరండూల్‌లో ఇవాళ ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం 7 గంటల సమయంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ పోలీసులు కలిసి కూంబింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ వెల్లడించారు.


logo