మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 13:08:03

ఛత్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్.. మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్.. మావోయిస్టు మృతి

బిజాపూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు పోలీసుల‌కు మ‌ధ్య సోమ‌వారం ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. బీజాపూర్‌లోని పెడ‌పాల్-పిడియా అట‌వీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వ‌హిస్తున్న డిస్ట్రిక్డ్ రిజ‌ర్వ్ గార్డ్స్‌కు మావోయిస్టులు ఎదురుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఇరువ‌ర్గాల మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. పోలీసులు ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన న‌క్స‌లైట్ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి త‌ర‌లించారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo