వన్ నేషన్-వన్ ఎలక్షన్.. ఇండియాకు అవసరం : ప్రధాని

హైదరాబాద్: ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 80వ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ సందేశం ఇచ్చారు. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం భారత్‌కు అవసరమని ప్రధాని అన్నారు. జమిలి ఎన్నికల అంశంపై కేవలం చర్చ మాత్రమే కుదరదు అని, ఇప్పుడు ఆ విధానం భారత్‌కు ఎంతో అవసరమని ఆయన అన్నారు. ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఆ ఎన్నికల ప్రభావం అభివృద్ధి పనులపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసని, ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్లే మార్గదర్శకులవుతారని ప్రధాని మోదీ అన్నారు. మన రాజ్యాంగంలో ఎన్నో అంశాలు ఉన్నాయని, అయితే విధులు నిర్వర్తించడమే కీలకమైన అంశమని ప్రధాని తెలిపారు. విధుల నిర్వహణపై మహాత్మా గాంధీ చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టారని, హక్కులు-విధుల మధ్య సన్నిహిత సంబంధం ఉందని గాంధీ గుర్తించారని ఆయన తెలిపారు. మనం మన విధులను నిర్వర్తిస్తే, అప్పుడు మన హక్కులు ఆటోమెటిక్‌గా రక్షింపబడుతాయని ప్రధాని తెలిపారు. 2008లో ఇదే రోజున పాక్‌కు చెందిన ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని, విదేశీ పౌరులు, పోలీసులు ఆ దాడిలో చనిపోయారని గుర్తు చేశారు. వారందరికీ నివాళి అర్పిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరిచిపోదన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ కొత్త విధానాలతో ఎదుర్కొంటోందని, ఉగ్రవాదులతో పోరాడుతున్న భద్రతా దళాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
తాజావార్తలు
- రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
- పట్టు బిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి