శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 18:18:52

కూలీలు దేశంలో ఎక్క‌డైనా రేష‌న్ తీసుకోవ‌చ్చు..

కూలీలు దేశంలో ఎక్క‌డైనా రేష‌న్ తీసుకోవ‌చ్చు..


హైద‌రాబాద్‌: వ‌ల‌స కూలీలు దేశంలో ఎక్క‌డ ఉన్నా వాళ్లు రేష‌న్ కార్డుతో స‌రుకులు తీసుకోవ‌చ్చు.  మార్చి 2021 వ‌ర‌కు రేష‌న్ కార్డు పోర్ట‌బులిటీ నూరు శాతం పూర్తి అవుతుంద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతార‌మ‌న్ తెలిపారు.  ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డుకు సంబంధించిన ప‌లు అంశాలు వెల్ల‌డించారు. ఒకే దేశం, ఒకే రేష‌న్ కార్డు వ్య‌వ‌స్థ‌ను ఇప్ప‌టికే 83 శాతం అమ‌లు చేశామ‌న్నారు. ఈ విధానం వ‌ల్ల పేద ప్ర‌జ‌లు దేశంలో ఎక్క‌డ ఉన్నా వారికి పూర్తి రేష‌న్ ల‌భిస్తుంద‌న్నారు. దేశంలో ఉన్న అన్ని పీడీఎస్ షాపుల నుంచి వ‌ల‌స ల‌బ్ధిదారులు ఈ స్కీమ్ కింద రేష‌న్ పొంద‌వ‌చ్చు. 23 రాష్ట్రాల్లో ఉన్న 67 కోట్ల మంది పీడీఎస్ వాడుతున్న‌ట్లు ఆమె చెప్పారు. ఈ ఏడాది ఆగ‌స్టు వ‌ర‌కు 83 శాతం పోర్ట‌బులిటీ పూర్తి అవుతుంద‌న్నారు.రాబోయే రెండు నెల‌ల వ‌ర‌కు సుమారు 8 కోట్ల మందికి ఉచితంగా ఆహార‌ధాన్యాల‌ను అందించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ రేష‌న్ కార్డులు లేని వారికి 5 కేజీల బియ్యం లేదా గోధుమ పిండి ఇవ్వ‌నున్నారు.  కిలో చెన‌గ‌ప‌ప్పు కూడా ఇవ్వ‌నున్నారు.  దీని కోసం 3500 కోట్లు ఖర్చు చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. logo