బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 11:31:12

వ‌డోద‌ర‌లో క‌రోనా మ‌ర‌ణం.. గుజ‌రాత్‌లో 7కు చేరిన మృతులు

వ‌డోద‌ర‌లో క‌రోనా మ‌ర‌ణం.. గుజ‌రాత్‌లో 7కు చేరిన మృతులు

అహ్మ‌దాబాద్: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతూనే ఉన్న‌ది. అన్ని రాష్ట్రాల్లో మ‌ర‌ణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ది. తాజాగా మ‌రో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. గురువారం ఉద‌యం వ‌డోద‌రలో 52 ఏండ్ల వ్య‌క్తి క‌రోనాతో మృతిచెందాడు. మార్చి 19న శ్రీలంక నుంచి వ‌చ్చిన ఈ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో వ‌డోద‌రలోని ఎస్ఎస్‌జీ హాస్పిట‌ల్‌లో ఐసోలేష‌న్‌లో ఉంచామ‌ని, చికిత్స పొందుతూ ఈ ఉద‌యం మృతిచెందాడ‌ని గుజ‌రాత్ ఆరోగ్య శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యంతి ర‌వి మీడియాకు వెళ్ల‌డించారు. ఈ మృతితో క‌లిపి గుజ‌రాత్‌లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 7కు చేరింది. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు గుజ‌రాత్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87గా ఉన్న‌ది.  


logo