ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు త్వరలో జరుగనున్న తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నాడియా జిల్లాలోని శాంతిపూర్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే అరిందాం భట్టాచార్య పార్టీని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ ఇంచార్జి కైలాష్ విజయవర్గియా సమక్షంలో భట్టాచార్య న్యూఢిల్లీలోని బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. బీజేపీ కండువా కప్పుకునేందుకు అరిందాం భట్టాచార్య ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తున్నది.
అరిందాం భట్టాచార్య 2016 లో కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎన్నికల్లో గెలిచి, మరుసటి ఏడాదే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అరిందాం ఇప్పుడు బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పార్టీనీ వీడటం మమతా బెనర్జీకి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. గత నెలలో టీఎంసీ ఎంపీ సువేందు అధికారి నేతృత్వంలో మేదినిపూర్‌లో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఏడుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. తృణమూల్ పార్టీకి చెందిన చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంకా మమతపై కోపంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల సమయంలో పార్టీలో తిరుగుబాటు చేయడం వల్ల టీఎంసీ నాయకత్వం తీవ్ర మనస్తాపానికి గురైంది. పార్టీ యంత్రాంగం ప్రస్తుతం నష్ట నివారణలో నిమగ్నమై ఉన్నది.
దోంజూర్కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ కూడా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరం ఉంటున్నారు. ఈయన త్వరలో బీజేపీలో చేరుతారన్న చర్చ జోరుగా సాగుతోంది. బాలి నియోజకవర్గానికి చెందిన తృణమూల్ ఎమ్మెల్యే వైశాలి దాల్మియా కూడా పార్టీ అధినాయకత్వంపై కోపంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు క్రికెట్‌పై దృష్టి సారించినందున మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు రాష్ట్ర క్రీడా మంత్రి లక్ష్మీరతన్ శుక్లా పేర్కొంటూ పదవికి రాజీనామా చేయడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు లేఖ రాలేదు..
- భార్యతో గొడవ.. గొంతు కోసుకున్న భర్త
- ఖలిస్తాన్ గ్రూపుల బెదిరింపు : కెనడాలో హిందువులపై దాడుల పట్ల ఆందోళన
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్‌కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య