శనివారం 30 మే 2020
National - Mar 28, 2020 , 17:20:54

గుంటూరులో ఓ ఎమ్మెల్యేకు క‌రోనా?

గుంటూరులో ఓ ఎమ్మెల్యేకు క‌రోనా?

 అమ‌రావ‌తి: క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో శ‌ర‌వేగంగా విజృంభిస్తున్నది. అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ ఎమ్మెల్యేకు క‌రోనా సోకిందేమోన‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల ఎమ్మెల్యేను కలిసిన అత‌ని బంధువుల‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఎమ్మెల్యేకు కూడా క‌రోనా సోకే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు అనుమానించారు. ఈ నేప‌థ్యంలో  ఆయ‌న‌ను ఐసోలేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించి క‌రోనా నిర్ధారిత‌ పరీక్ష‌లు చేశారు.   

వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాకు చెందిన‌ ఓ ఎమ్మెల్యే బావమరిది, ఆయన భార్య ఇటీవలే ఢిల్లీకి వెళ్లొచ్చారు. వీరిద్దరికీ క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే, అంత‌కుముందు ఎమ్మెల్యే బావ‌మ‌రిది, ఆయన భార్య ఇద్ద‌రూ ఎమ్మెల్యేను క‌లిశారు. దీంతో ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకిందేమోన‌న్న‌ అనుమానంతో గుంటూరు సమీపంలోని ఓ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ కు త‌ర‌లించి ఆయనకు, ఆయన భార్యకు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. 


logo