సోమవారం 25 జనవరి 2021
National - Jan 05, 2021 , 01:27:24

స్కూల్‌కి వెళ్తే రోజుకు వంద రూపాయలు

స్కూల్‌కి వెళ్తే రోజుకు వంద రూపాయలు

గువాహటి, జనవరి 4: బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా అసోం ప్రభుత్వం వినూత్న కార్యక్రమాల్ని చేపట్టింది. పాఠశాలల్లో తరగతులకు హాజరయ్యే ప్రతి విద్యార్థినికి రోజుకు రూ.100 చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేస్తామని విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ నెల చివరి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. పన్నెండో తరగతి పరీక్షల్లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినిలకు మోటారు సైకిళ్లను అందజేస్తున్నట్టు చెప్పారు. డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు జనవరి చివరినాటికి రూ.1,500, రూ.2,000 చొప్పున నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటించారు.logo