గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 10:09:19

విరిగిప‌డ్డ కొండ చ‌రియ‌లు.. ఒక‌రు మృతి, ఇద్ద‌రికి గాయాలు

విరిగిప‌డ్డ కొండ చ‌రియ‌లు.. ఒక‌రు మృతి, ఇద్ద‌రికి గాయాలు

రాంబ‌న్‌: జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం రాంబ‌న్ ఏరియాలోని షేరీలో ఒక ర‌హ‌దారిపై శ‌నివారం రాత్రి కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ప‌లు వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని రాంబ‌న్‌లోని జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గ‌త రెండు రోజులుగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో కొండ‌ప్రాంతాలు త‌డిసిపోయి ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని రాంబ‌న్ జిల్లా అధికారులు తెలిపారు.        


logo