ఆదివారం 31 మే 2020
National - May 17, 2020 , 15:11:06

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి.. ఐదుగురికి గాయాలు

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి.. ఐదుగురికి గాయాలు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. న‌వీ ముంబైలోని క‌లంబోలి వ‌ద్ద ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై స్టేష‌న‌రీ సామాగ్రితో వెళ్తున్న ఒక బ‌స్సును 8 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న మినీ బ‌స్సు డీకొట్ట‌డంతో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెందారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదంలో మొత్తం ఆరుగురు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, వారిని స‌మీపంలో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా కాసేప‌టికే ఒక వ్య‌క్తి మృతిచెందాడ‌ని న‌వీ ముంబైలోని క‌మోతే పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ బాబా సాహెబ్ తూపే తెలిపారు. క‌ర్ణాట‌క‌కు చెందిన బ‌స్సు 8 మందితో అహ్మ‌దాబాద్‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు.  


logo