శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 09:55:22

మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన క్రేన్‌.. మ‌హిళ‌ మృతి

మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన క్రేన్‌.. మ‌హిళ‌ మృతి

ముంబై: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ క్రేన్‌ మెట్రో పిల్ల‌ర్‌ను ఢీకొట్ట‌డంతో ఒక‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌హాన‌గ‌రంలో కొత్త‌గా మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. కాగా, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో ఉన్న అంధేరి గుండవాలి బస్ స్టాప్ వద్ద మెట్రో పిల్ల‌ర్‌ను ఓ క్రేన్ అదుపుత‌ప్పి మెట్రో పిల్ల‌ర్‌ను ఢీకొట్టింది. బ‌స్టాప్‌లో బ‌స్సుకోసం వేచిచూస్తున్న ఓ మ‌హిళ క్రేన్ వెనుక టైర్ల కింది చిక్కుకుపోయింది. దీంతో ఆమె అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించింది. మెట్రో పిల్ల‌ర్‌ను ఢీకొట్ట‌ని క్రేన్ అటుగా వెళ్తున్న ఓ ఆటోకు త‌గిలింది. అందులో ఉన్న ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌పడ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఉద‌యం పూట ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.