బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 12:09:23

తిరుమలలో శ్రీవారి సాక్షిగా ఒక్కటైన ఓ జంట

తిరుమలలో శ్రీవారి సాక్షిగా ఒక్కటైన ఓ జంట

కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలోకి భక్తుల రాకపై నిషేధం కొనసాగుతున్నది. కేవలం అర్చకులు మాత్రమే స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుమల కళ్యాణమండపాల్లో వివాహాలకు కూడా ప్రస్తుతం ఎలాంటి అనుమతులు ఇవ్వడంలేదు. అయినా ఓ జంట మాత్రం శుక్రవారం తిరుమల శ్రీవారి సాక్షిగా ఒక్కటయ్యింది. ఎలాగంటే.. వారు శుక్రవారం నాటి వివాహం కోసం చాలా రోజుల క్రితమే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్నారు. దీంతో టీటీడీ మేనేజ్‌మెంట్‌ వారి వివాహానికి అనుమతించక తప్పలేదు. అయితే ఈ వివాహానికి ఎక్కువ మంది బంధుమిత్రులు హాజరుకావద్దని అధికారులు షరతు విధించారు. దీంతో కేవలం వధూవరుల కుటుంబసభ్యులు మాత్రమే ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.          


logo
>>>>>>