సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 11:22:21

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. సీఏఎఫ్‌ జవాను మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. సీఏఎఫ్‌ జవాను మృతి

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నారాయణపూర్‌లోని ధుర్‌ వద్ద సీఏఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో సీఏఎఫ్‌ జవాను మృతి చెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.


logo